వరలక్ష్మి పెళ్లి వేడుకలో మాస్ స్టెప్పులతో హోరెత్తించిన రాధిక, శరత్ కుమార్..!
‘హనుమాన్’ సినిమాతో హిట్ కొట్టిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, సినిమా: ‘హనుమాన్’ సినిమాతో హిట్ కొట్టిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ముంబైకి చెందిన వ్యాపారవేత్త నికోలయ్ సచ్‌దేవ్‌తో దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నది. ఇక రీసెంట్‌గానే పెద్దలను ఒప్పించి ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది నటి వరలక్ష్మి. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ మరికొన్ని గంటల్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనుంది. నికోలాయ్ సచ్ దేవ్‌తో కలిసి ఆమె పెళ్లిపీటలెక్కనుంది. థాయ్ లాండ్ వేదికగా మంగళవారం (జులై 2) వీరి వివాహ వేడుక జరగనుంది.
ఇక ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. తాజాగా వరలక్ష్మి మెహందీ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో భాగంగా ఆమె తల్లి దండ్రులు రాధిక, శరత్‌కుమార్ స్టెప్పులేస్తూ సందడి చేశారు. మెహందీ వేదిక వద్దే అతిథులతో కలిసి డ్యాన్స్ చేస్తూ అలరించారు. విజయ్ దళపతి సూపర్ హిట్ సాంగ్ అపడి పోడి పాటకు రాధిక, శరత్ కుమార్‌లు స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్ తెలుపుతున్నారు.