ఇప్పుడు ఎన్నికలు పెట్టినా పూరీ జగన్నాథ్ సీఎం.. నేను హోమ్ మినిస్టర్ అవుతాం.. అలీ షాకింగ్ కామెంట్స్

ఇండస్ట్రీలో కమెడియన్ అలీ - పూరి జగన్నాథ్‌లది విడదీయరాని బంధం. ఆయన సినిమాల్లో ఎవరికి అవకాశం ఉన్నా లేకున్నా అలీకి మాత్రం ప్రత్యేకంగా చిన్న పాత్రయినా ఉంటుంది.

Update: 2024-06-26 07:34 GMT

దిశ, సినిమా: ఇండస్ట్రీలో కమెడియన్ అలీ - పూరి జగన్నాథ్‌లది విడదీయరాని బంధం. ఆయన సినిమాల్లో ఎవరికి అవకాశం ఉన్నా లేకున్నా అలీకి మాత్రం ప్రత్యేకంగా చిన్న పాత్రయినా ఉంటుంది. ఆ పాత్రలు అలీకి కూడా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆస్తులన్నీ అమ్మేసి నడిబజారులో నిలబడిన పూరి జగన్నాథ్‌కు రూ.లక్షలు విలువ చేసే గోల్డ్ చైన్‌ని ఇచ్చి ఇది దగ్గరుంటే పోయినవన్నీ తిరిగొస్తాయని చెప్పారు అలీ. ఆయన చెప్పినట్లే పూరి జగన్నాథ్ తిరిగి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. తాను సంతోషంగా ఉంటే ఒక బొకే.. బాధలో ఉన్నప్పుడు ఒక పెగ్ మందు మాత్రం పోసి వెళ్తాడని పూరీ చెబుతారు.

ఇదిలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమా ఈవెంట్‌కు హాజరైన నేపథ్యంలో పూరి జగన్నాథ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అలీ. ఓ మూవీ ఈవెంట్‌కు హాజరైన అలీ.. మాట్లాడుతూ థాయ్‌లాండ్‌ ఓ రాజ్యం కాబట్టి సరిపోయింది కానీ , అక్కడ ఎన్నికలు పెడితే పూరి జగన్నాథ్ సీఎం .. తాను హోమ్ మినిస్టర్ అని వ్యాఖ్యానించారు. అయితే అలీ ఈ మాటలు అనడం వెనుక కారణం ఉందండోయ్..

పూరి జగన్నాథ్‌కి కష్టం అనిపించినా, మూడీగా ఉన్నా వెంటనే థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో వాలిపోతారు. అక్కడ బీచ్‌లలో కూర్చొని కథలు రాసుకోవడం ఆయనకు అలవాటు. తన సినిమాల్లో కొన్ని సన్నివేశాలైనా బ్యాంకాక్‌లో షూట్ జరుపుకోవాల్సిందే. అంతేకాదు తనకు బ్యాంకాక్‌లో అభిమానులు ఉన్నారని, అక్కడ పోటీ చేసినా గెలుస్తానని పూరి జగన్నాథ్ ఎన్నోసార్లు చెప్పారు. బ్యాంకాక్ బీచ్‌లలో చూపు తిప్పుకోకుండా ఉండలేమని, అలాంటి చోట స్క్రిప్ట్ రాయడం కష్టమని కానీ ఆ ప్రదేశాల్లో ఉంటేనే మన ఏకాగ్రత ఎంతో తెలుస్తుందని పూరీ చెప్పారు. ఆయనతో స్నేహామో ఏమో కానీ అలీ కూడా థాయ్‌లాండ్ ఎక్కువగా విజిట్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన పై విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


Similar News