పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కి.. ఇదేం క్రియేటివిటీ చరణ్ ?
ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పేరుతో రామ్ చరణ్ కు ఇటీవల పబ్లిసిటీ మోజు భయంకరంగా పట్టేసింది.
దిశ, వెబ్ డెస్క్: ఆర్ఆర్ఆర్ తో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన పేరుతో రామ్ చరణ్ కు ఇటీవల పబ్లిసిటీ మోజు భయంకరంగా పట్టేసింది. ముంబాయిలో ఒకటికి రెండు ఏజెన్సీలను అపాయింట్ చేసి మరీ స్టోరీలు, ఫొటోలు ఒకదాని వెంట మరోటి వదులుతున్నారు. పబ్లిసిటీ పీక్స్ లో వుండేలా చూసుకుంటున్నారు. ఉదయం లేస్తే వార్త లేదా ఓ ఫొటో మళ్లీ మధ్యాహ్నానికి మరో వార్త ఓ ఫొటో. ఇక సాయంత్రం అయితే అంతే. ఈ క్రమంలోనే పబ్లిసిటీ బ్యాచ్ ఇటీవల ఓ సాయంత్రం ఓ ఫోటో వదిలారు. దాన్ని తయారు చేసిన వారి క్రియేటివిటీకి జోహార్లు చెప్పాల్సిందే.
పై ఫొటోలో రామ్ చరణ్ స్టయిల్ గా టేబుల్ మీద కూర్చొని ఉన్నారు. టేబుల్ మీద కొత్తగా వచ్చిన గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు ఉన్నాయి. కిందన నేల మీద చరణ్ కాళ్ల దగ్గర ఓ పక్కన ఫిల్మ్ ఫేర్ అవార్డులు, మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం అందజేసే నందీ అవార్డులు పెట్టారు. ఇది ఎంత దారుణం ఇది కదా? ఎంత చిన్న చూపు మన నంది అవార్డు అంటే. అంతే కాదు మన మీడియాలో వచ్చిన వార్తల క్లిప్పింగ్ లు కూడా కాళ్ల దగ్గర పడేశారు. ఆఖరికి చిరంజీవి పూజించే అంజనీ పుత్రుడి బొమ్మ వున్న కొణిదేల బ్యానర్ సింబల్ వున్న ప్రింట్ లు కూడా కాళ్ల దగ్గర నేలపైనే పెట్టారు. దీంతో ఈ ఫొటో చూసిన నెటిజన్లు, సగటు సినీ అభిమానులు ఏంటిది చరణ్? ఇదేం క్రియేటివిటీ అంటూ పెదవి విరుస్తున్నారు?
Also Read..
Mega Heroes: కోలీవుడ్ వైపు చూస్తున్న మెగా ఫ్యామిలీ? ఎందుకో తెలుసా?