ఘనంగా జరిగిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రీ రిలీజ్ ఈవెంట్

నాగ శౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’.

Update: 2023-03-13 10:51 GMT

దిశ, సినిమా : నాగ శౌర్య, శ్రీనివాస్ అవసరాల కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌తో కలిసి టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన సినిమా మార్చి 17న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఘనంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అడివి శేష్, నిర్మాతలు అశ్వినీదత్, సునీల్ నారంగ్, రవి శంకర్, దామోదర ప్రసాద్, కోన వెంకట్, బాబీ కొల్లి, మారుతి, నందిని రెడ్డి అతిథులుగా హాజరై చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘రికార్డు అవుతుందా? యాక్షనా? యాక్షన్’ అనే వాయిస్‌తో మైదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుటోంది. ఇక నాగశౌర్య, శ్రీనివాస్ కలిసి మరోసారి మాయ చేయబోతున్నారన్న అతిథులు ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టేస్తుందని, మాళవిక పక్కింటి అమ్మాయిలా సహజంగా నటించిదంటూ మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Tags:    

Similar News