ఓటీటీలో రికార్డు బ్రేక్ చేసిన ప్రసన్న వదనం మూవీ

కొద్దీ రోజుల్లోనే ఆ మార్క్‌ను క్రాస్ చేసిన సినిమాగా రికార్డు పొందింది.

Update: 2024-06-02 03:42 GMT

దిశ, సినిమా : యంగ్ హీరో సుహాస్ నటించిన తాజా చిత్రం ప్రసన్న వదనం. దర్శకుడు సుకుమార్ శిష్యుడు అర్జున్ వై.కె. ఫేస్ బ్లైండ్‌నెస్ అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో, మే 3న థియేటర్లలోకి వచ్చి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్, వైవా హర్ష, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో మరోసారి తన నటనతో మెప్పించాడు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్‌పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో కొత్త రికార్డు క్రియోట్ చేసింది.

ఇటీవలే ఈ చిత్రం OTTలో రికార్డు వ్యూస్‌ని సాధించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో మే 24న విడుదలైంది. ఈ చిత్రం ఇటీవలే 100 మిలియన్ నిమిషాల స్ట్రీమింగ్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆహాలో అధికారికంగా ప్రకటించింది. 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటిందని పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.

ఈ మూవీ OTT లో విడుదలైన తొమ్మిది రోజుల్లోనే ఈ మార్కును దాటింది. మూడు రోజుల్లో, ఇది 50 మిలియన్ నిమిషాల స్ట్రీమింగ్‌ను దాటింది. ఆహాలో కొద్దీ రోజుల్లోనే ఆ మార్క్‌ను క్రాస్ చేసిన సినిమాగా రికార్డు పొందింది. ఇప్పుడు 100 మిలియన్ మార్క్‌ను కూడా దాటేసింది.


Similar News