Malavika Mohanan: మా అమ్మ ఫుడ్ తర్వాత ప్రభాస్ ఫుడ్డే బెస్ట్.. యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం కల్కి భారీ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మరో 6 సినిమాలు ఓకే చేసి బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ మూవీలో హీరోగా మన డార్లింగ్ నటిస్తున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక తాజాగా రిలీజ్ అయిన పోస్టర్‌తో ఈ మూవీ పై మరింత హైప్ పెరిగిపోయింది.
ఇదిలా ఉంటే డార్లింగ్.. సినిమా సెట్స్‌లో హీరోయిన్స్‌కి, ఆర్టిస్టులకు అప్పుడప్పుడు ఇంటి నుంచి పలు రకాల ఫుడ్ తెప్పించి మరీ పెడతాడని తెలిసిందే. ప్రభాస్ పెట్టే ఫుడ్ గురించి ఇప్పటిదాకా అతనితో పని చేసిన ప్రతి హీరోయిన్ మాట్లాడారు. తాజాగా ఆ లిస్ట్‌లో తమిళ భామ మాళవిక మోహనన్ కూడా యాడ్ అయిపోయింది. రీసెంట్‌గా తాను నటించిన విక్రమ్ ‘తంగలాన్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాళవిక హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది. ఈ క్రమంలో ప్రభాస్ రాజా సాబ్ గురించి ప్రశ్నలు ఎదురవగా ప్రభాస్ ఫుడ్ గురించి మాట్లాడింది.
మాళవిక మోహనన్ మాట్లాడుతూ.. “నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ నాకు ఫుడ్ పంపించాడు. మా అమ్మ ఫుడ్ తర్వాత నేను ఇప్పటివరకు తిన్న ఫుడ్‌లో బెస్ట్ ఫుడ్ ప్రభాస్ సర్ పంపించిందే. ఆల్మోస్ట్ మా అమ్మ ఫుడ్‌కి ఈక్వల్‌గా ఉంటుంది” అని మాళవిక మోహనన్ తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలకు డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.