Salaar : విడుదలకుముందే ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘సలార్’!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘సలార్’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి పార్ట్ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం

Update: 2023-08-09 06:07 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘సలార్’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి పార్ట్ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం రిలీజ్‌కు ముందే ఈ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసింది. అది కూడా అమెరికాలో కావడం విశేషం. ఆ దేశంలోని అన్ని సినీ మార్క్ థియేటర్లలో ఈ ‘సలార్’ రిలీజ్ కానుంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ అక్కడ 285 సినీ మార్క్ థియేటర్లలో రిలీజై రికార్డు క్రియేట్ చేయగా ఇప్పుడు ప్రభాస్ మూవీ దానిని అధిగమించి అమెరికాలో ఏకంగా 1980కి పైగా స్క్రీన్లలో రిలీజ్ కాబోతోందని లార్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. మొత్తానికి ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

Read More:   స్టార్ హీరోల సెన్సేషనల్ మూవీస్ రీరిలీజ్ డేట్స్ కన్ఫామ్.. ఇక థియేటర్లలో జాతరే! 

Tags:    

Similar News