Prabhas: ప్రభాస్ కోసం రిస్క్ చేయనున్నారా?

కరోనా తర్వాత బడ్జెట్ తగ్గుతుందని చాలా మంది అనుకున్నారు.

Update: 2023-03-22 03:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : రోజు రోజుకు తెలుగు సినిమా బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. కరోనా తర్వాత బడ్జెట్ తగ్గుతుందని చాలా మంది అనుకున్నారు. 10 ఏళ్ల క్రితం సినిమాను రూ. 20 కోట్లు పెట్టి తీస్తే అమ్మో అన్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా మొత్తం మారిపోయింది. సినిమా బడ్జెట్ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం రాజమౌళినే. తెలుగు సినిమా కీర్తిని పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ కు.. అక్కడి నుంచి ఆస్కార్ వరకు తీసుకెళ్లాడు. జక్కన్నని చూసి అందరు వారి సినిమా బడ్జెట్‌ను అమాంతం పెంచేశారు. స్టార్ హీరో సినిమా అంటే మినిమమ్ రూ.200 కోట్లు ఈజీగా పెడుతున్నారు. మగధీర సినిమాకు 40 కోట్లు పెడితే రూ. 70 కోట్లు వసూలు చేసింది. రాజమౌళి సినిమా అంటే బడ్జెట్ వందల కోట్లలో మాటే. బాహుబలితో వచ్చిన ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌తో సినిమాల బడ్జెట్‌ లెక్కలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదిపురుష్ సినిమా రూ. 550 కోట్లతో తెరకెక్కిస్తున్నారు.. ఇక ప్రాజెక్ట్ కే సినిమా అయితే రూ. 600 కోట్లు పెడుతున్నారట.

Read more:

Mahesh Babu: రాజమౌళి, మహేష్ సినిమా బడ్జెట్ ఏంతో తెలుసా?

Tags:    

Similar News