వివాదంలో ప్రభాస్ కల్కి చిత్రం!.. ఆ ఆర్ట్ నాదే?

Update: 2024-06-13 11:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి సినిమా కాపీ వివాదంలో చిక్కుకుంది. సినిమా ట్రైలర్ లోని ఇంట్రో సీన్ కాన్సెప్ట్ ను కాపీ చేశారని సౌత్ కొరియా కు చెందిన కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఆరోపణలు చేస్తున్నాడు. హాలివుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ సంగ్ చోయ్ తాను పదేళ్ల క్రితం క్రియేట్ చేసిన ఆర్ట్ ను కల్కి బృందం తన అనుమతి లేకుండా ఉపయోగించిందని ఆరోపిస్తున్నాడు. ట్రైలర్ లో కాపీకి సంబందించిన పిక్ ను తన ఆర్ట్ తో పోల్చుతూ ఇన్ స్టాగ్రామ్ వేధికగా కల్కి టీంపై మండిపడ్డాడు. అంతేగాక దీనిపై తన కళాకృతిని అనుమతి లేకుండా ఉపయోగించడం చెడ్డ పని అంటూ.. ఈ చట్టవిరుద్దమైన పని నన్ను ప్రశ్నించేలా చేస్తుంది అని రాసుకొచ్చాడు. దీనిపై ఇప్పటివరకు కల్కి టీం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం కల్కి 2898 AD యొక్క ట్రైలర్ సోమవారం విడుదల చేయబడింది. ట్రైలర్ విడుదలైన తర్వాత, ప్రేక్షకులు కల్కి యొక్క పోస్ట్-అపోకలిప్టిక్ ప్రపంచం హాలీవుడ్ చిత్రాలైన డూన్ అండ్ మ్యాడ్ మ్యాక్స్, ఫ్యూరీ రోడ్ వంటి సినిమాలను కాపీ చేశారని అన్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటానీ నటించిన ఈ చిత్రం పలు వాయిదాల అనంతరం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.

Tags:    

Similar News