Prabhas: స్టార్ డైరెక్టర్ మూవీనే రిజెక్ట్ చేసిన డార్లింగ్.. ఏం జరిగిందంటే..

చాన్స్ దొరికితే చాలు స్టార్ హీరోలు సైతం ఆ దర్శకుడి కాంబోలో మూవీస్ చేయాలని తెగ ఇంట్రెస్ట్ చూపుతుంటారు.

Update: 2024-08-04 13:51 GMT

దిశ, సినిమా : చాన్స్ దొరికితే చాలు స్టార్ హీరోలు సైతం ఆ దర్శకుడి కాంబోలో మూవీస్ చేయాలని తెగ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. కానీ ఒక్కడు మాత్రం ఆయన కథను విని, తనకు నచ్చలేదని రిజెక్ట్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ దర్శకుడెవరు? రిజెక్ట్ చేసిందెవరు? అంటే.. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ, హీరో ప్రభాస్.

సినీ లవర్స్‌లో ఫుల్ ఫేమ్ అండ్ క్రేజ్ ఉన్న ఇండియన్ స్టార్ హీరోల జాబితాలో టాలీవుడ్ నుంచి చూసుకున్నప్పుడు ప్రభాస్ పేరు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుందని చెప్తారు. బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్‌కి ఎదిగిన డార్లింగ్ ఆ తర్వాత మూవీస్ పరంగా ఓటమిని ఎదుర్కొన్నాడు. అయినా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూనే వచ్చాడు. కాగా హ్యాట్రిక్ ఫెయిల్యూర్ తర్వాత మాత్రమే లక్కు తలుపు తట్టింది. ఆ తర్వాత సలార్‌తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇటీవల కల్కితో మరో హిట్ కొట్టాడు.

ఇకపోతే ప్రభాస్ గురించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఏంటంటే..త్రీ ఇడియట్స్, సంజు, మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ గురించి తెలిసిందే. కాగా అతను బాహుబలి తర్వాత ప్రభాస్‌తో ఓ మూవీ చేయడానికి చాలా ఆసక్తి చూపాడు. ఓ అద్భుతమైన స్టోరీని కూడా రెడీ చేసి వినిపించగా.. కథ చాలా బాగుంది.. కానీ అంత సాఫ్ట్ స్టోరీ అయితే తన బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అవ్వదని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేశాడట డార్లింగ్.

ఇక యాక్షన్ మూవీగా తెరకెక్కిన ‘కల్కి’ సక్సెస్ సాధించిన నేపథ్యంలో రాజ్ కుమార్ హిరానీ స్టోరీని రిజెక్ట్ చేసిన విషయం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే కల్కి సక్సెస్ చూసిన రాజ్ కుమార్, ప్రభాస్ కోసం ఓ యాక్షన్ మూవీ చేసేందుకు రెడీగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ప్రభాస్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. 

Tags:    

Similar News