Prabhas మూవీలో బాలీవుడ్ హీరో కీ రోల్.. పూనకాలేనంటున్న ఫ్యాన్స్
ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కీ రోల్ పోషించబోతన్నట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది.
దిశ, సినిమా : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ కలయికలో రాబోతున్న సినిమా నుంచి మరో బిగ్ అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కీ రోల్ పోషించబోతన్నట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఇప్పటికే కథ విన్న హృతిక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, తాను చెప్పిన పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపించాడని సిద్ధార్థ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా షారుఖ్-దీపిక కలయికలో వచ్చిన 'పఠాన్' విడుదలకు ముందే భారీ పాపులారిటీ దక్కించుకోగా.. తదుపరి ప్రాజెక్ట్‌లో ప్రభాస్- హృతిక్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే పూనకాలేనంటున్నారు నెటిజన్లు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇవి కూడా చదవండి : 'Writer Padmabhushan' హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: Shanmukh Prashanth