నెక్ట్స్ సీఎం ఆయనే.. పోసాని సంచలన వ్యాఖ్యలు
జూనియర్ ఎన్టీఆర్ త్వరలో రాజకియాల్లోకి రావాలని చాలా మంది ఎదురు
దిశ, వెబ్ డెస్క్ : జూనియర్ ఎన్టీఆర్ త్వరలో రాజకియాల్లోకి రావాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలెక్షన్స్ వచ్చినా ఎన్టీఆర్ పేరు వినిపిచడం అనేది కామన్. అంతే కాకుండా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సత్తా చాటుతాడని, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న పోసాని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అచ్చం సీనియర్ ఎన్టీఆర్ లాగానే ఉండే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొత్త మార్పుకు శ్రీకారం చుడుతాడని, ఆయనతో ఎన్నో మార్పులు చోటచేసుకుంటాయన్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ తో చంద్రబాబుకు చాలా అవసరం ఉంది.. చాలా వాంటెడ్ పర్సన్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యే కెపాసిటీ ఉన్నది ఎన్టీఆర్ కు మాత్రమే ఉంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ను ఎవరు ఏమి అనడం లేదు అతనితో మంచిగా ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లన్నీ తమ పార్టీకే పడతాయని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తర్వాత సీఎం అతనే అంటూ పోసాని షాకింగ్ కామెంట్స్ చేశాడు.