సెలబ్రిటీలపై పూనమ్ కౌర్ సెన్సేషనల్ కామెంట్స్.. పోసాని విషయంలో ఈ ఐక్యమత్యం ఏమైందంటూ ట్వీట్
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. స్టార్ హీరోయిన్ సమంత పై చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మంత్రి కొండా సురేఖ.. స్టార్ హీరోయిన్ సమంత పై చేసిన కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి. దీనిపై ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సినీ ఇండస్ట్రీలో దుమారమే రేపుతోంది. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖ సెలబ్రిటీలు స్పందించారు. సెలబ్రిటీల విషయంలో కానీ, వారి ఫ్యామిలీ విషయంలో కానీ అసాధారణ ఆరోపణలు చేస్తే సినీ వర్గాలు దీన్ని సహించదు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో పంజాబీ ముద్దుగుమ్మ పూనమ్ కౌర్ ఓ సంచలన ట్వీట్ చేసింది. సినీ సెలబ్రిటీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇప్పుడున్న ఐక్యమత్యం.. పోసాని మాపై కామెంట్లు చేసినప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేదంటూ ప్రశ్నిస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గతంలో పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ మీద ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయాడు. అంతే కాకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడాడు. పూనమ్ పేరు కూడా పరోక్షంగా తీశాడు. అలాగే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పేర్లు పెట్టి పోసాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అప్పుడు తన గురించి ఎందుకు ఎవరు నిలబడలేదు అంటూ పూనమ్ ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది. కాగా సమంత విషయంలో ఇంతమంది ఏకతాటిపై నిలబడి అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కదా అదే పవన్ విషయంలో నా పేరు కూడా బయటకు వచ్చింది అప్పుడు ఎందుకు మీరు స్పందించలేదు అంటూ పూనమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ భామ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.