ప్లాపులతో నెట్టుకొస్తున్న బుట్టబొమ్మ.. డేంజర్ జోన్‏లో పూజా సీని కెరీర్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Update: 2023-09-03 07:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత స్టార్ హీరో సరసన నటించి తన అందం అభినయంతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తక్కువ సమయంలో స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడుకి ఏడాది నుంచి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆమె ఇటీవల నటించిన బీస్ట్, రాధే శ్యామ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. ఓవైపు పూజాకు హిట్ లేకపోవడం.. మరోవైపు అనుహ్యంగా ఆమె బిగ్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంటుండడంతో బుట్టబొమ్మ కెరీర్ డేంజర్ జోన్ లో పడినట్లు తెలుస్తోంది.

మొన్నటి వరకు వెంట వెంటనే ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ నంబర్ వన్ స్థానంలో ఉన్న పూజాకు ఇప్పుడు అన్ని డిజాస్టర్ పలకరిస్తున్నాయి. 2022 చివర్లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సర్కస్ చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. ఇక 2023 సగం ఏడాది పూర్తయినప్పటికీ పూజాకు మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ సరసన కిసీ కా భాయి కిసీ కా జాన్ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. దీంతో వరుసగా ఫ్లాపులతో అమ్మడుకి కెరీర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News