నా జీవితంలో మరపురాని క్షణం అది.. బుట్టబొమ్మ
యంగ్ బ్యూటీ పూజా హెగ్దే తన కెరీర్‌కు సంబంధించిన ఓ స్పెషల్ మూమెంట్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది.
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పూజా హెగ్దే తన కెరీర్‌కు సంబంధించిన ఓ స్పెషల్ మూమెంట్‌ను అభిమానులతో షేర్ చేసుకుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ అన్నీ భాషల్లో సినిమాలు చేస్తున్న బుట్టబొమ్మ.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తాను గొప్పగా ఫీల్ అయిన ప్రత్యేక క్షణాల గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తున్నపుడు మాధురీ దీక్షిత్ మేడమ్‌ను కలిశాను. ఓ సెట్‌లో ఉన్నపుడు ఆమెకు హాయ్ చెప్పడానికి దగ్గరకు వెళ్లాను. అయితే మాధురీ మేడం ‘హాయ్ పూజా.. ఎలా ఉన్నావు?’ అని నాకంటే ముందే పలకరించింది. దీంతో మాధురీగారికి నా పేరు ఎలా తెలుసని ఆశ్చర్యపోయాను. ఇది నిజంగా నా జీవితంలో మరపురాని క్షణం’ అంటూ మురిసిపోయింది పూజ.
Also Read: భర్త ఉన్నా లేనట్లే.. వైరల్‌గా మారిన ప్రియమణి ఎమోషనల్ పోస్ట్!