Sreeleela : శ్రీలీల కారణంగా పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తున్న పూజా హెగ్డే
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే.. కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ అందుకుంటూ పైకి లేవలేని స్థితిలో పడింది. అటు బాలీవుడ్‌లో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్
దిశ, సినిమా: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే.. కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ అందుకుంటూ పైకి లేవలేని స్థితిలో పడింది. అటు బాలీవుడ్‌లో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ చిత్రంతో టాలీవుడ్‌లో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనే ఆశలు పెట్టుకున్నప్పటికీ కలిసి రాకుండా పోయింది. మొత్తానికి ఈ మూవీ నుంచే తప్పుకుంది. ఎందుకంటే మెయిన్ హీరోయిన్‌గా పూజా హెగ్డేని అనుకున్నారు. కానీ ఆ తర్వాత పూర్తి స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, శ్రీ లీలను మెయిన్‌గా.. పూజను సెకండ్ హీరోయిన్‌గా చేశారని తెలుస్తోంది. దీనికి ఆమె అవమానంగా ఫీల్ అయి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాక్. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, శ్రీ లీల విషయంలో పూజ చాలా సీరియస్‌గా ఉందని సమాచారం. ఇదొక్కటే కాదు శ్రీ లీల కారణంగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి కూడా తప్పుకుందట పూజ. జూనియర్ యాక్టర్ కింద సెకండ్ హీరోయిన్‌గా నటించడం ఇష్టం లేకనే ఇలా చేస్తుందని ఇండస్ట్రీ టాక్. కాగా ఈ పిచ్చి ప్రవర్తన కారణంగా పూజకి ఇండస్ట్రీలో ఉన్న పేరు పడిపోతుందని భావిస్తున్నారు విశ్లేషకులు.
Read more :
నాగ చైతన్యను పొగడ్తలతో ముంచెత్తేసిన శోభిత ధూళిపాళ్ల.. అసలు ఏం జరుగుతోంది?