త్రివిక్రమ్ నుంచి మళ్లీ పిలుపందుకున్న పూజా హెగ్డే?

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబో గురించి చెప్పక్కర్లేదు.

Update: 2023-09-25 07:03 GMT

దిశ, సినిమా: దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబో గురించి చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికలో గతంలో తెరకెక్కిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి సినిమాలు రికార్డులు సృష్టించాయి. ఒకదాన్ని మించి మరొకటి విజయాన్ని అందుకున్నాయి. ఇక తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి బన్నీ మరో సినిమా చేయనున్నాడనే విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్ తదితర వివరాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగా ఈ మూవీలో బన్నీ జోడీగా పూజా హెగ్డే‌ను హీరోయిన్‌గా తీసుకోబోతున్నారట. మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా మిస్ చేసుకున్న పూజకు త్రివిక్రమ్ మళ్లీ ఛాన్స్ ఇస్తున్నాడని టాక్ నడుస్తోంది. 

Read more Latest Cinema Updates

Tags:    

Similar News