మనీలాండరింగ్ కేసులో Jacqueline Fernandez కు మరోసారి నోటీసులు
Money laundering case: Actress Jacqueline Fernandez stopped from leaving India by ED
దిశ, సినిమా: రూ. 200 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే తనతో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రేమలో ఉందని.. ఆమె అతడి నుంచి భారీ మొత్తంలో కానుకలు అందుకుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 14న విచారణకు హాజరు కావాలని ఢిల్లీ పోలీసులు జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉంటే చంద్రశేఖర్‌పై ప్రస్తుతం పదికి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటి గురించి జాక్వెలిన్‌కు తెలిసినప్పటికీ అతనితో ఆర్థికలావాదేవీల్లో పాల్గొన్నదని ఈడీ తాము దాఖలు చేసిన చార్జిషీట్లో ప్రస్తావించింది. 2021 ఆగస్టు 30, అక్టోబరు 20న ఫెర్నాండెజ్ స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేశామని, చంద్రశేఖర్ నుంచి బహుమతులు అందుకున్నట్లు ఆమె అంగీకరించిందని ఈడీ గతంలోనే పేర్కొంది. అంతేకాకుండా ఈ ఆదాయాన్ని ఇండియాతో పాటు విదేశాల్లో తనకు తన కుటుంబ సభ్యుల కోసం ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపింది.