17 ఏళ్ల తర్వాత మళ్లీ రిలీజైన POKIRI. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కలెక్షన్లు

దిశ, వెబ్‌డెస్క్: Super Star Mahesh Babu కెరీర్‌లో 'POKIRI' చాలా ప్రత్యేకమైన సినిమా. కేవలం మహేశ్ బాబుకే కాకుండా దర్శకుడు Puri Jaganadh కు కూడా స్పెషల్ ఫిల్మ్.

Update: 2022-08-19 03:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో 'పోకిరి' చాలా ప్రత్యేకమైన సినిమా. కేవలం మహేశ్ బాబుకే కాకుండా దర్శకుడు పూరి జగన్నాథ్‌కు కూడా స్పెషల్ ఫిల్మ్. అప్పటివరకు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న మహేశ్‌కు, పూరికి 'పోకిరి' సెన్సేషనల్ హిట్ ఇచ్చింది. హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో మహేష్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో మరోసారి పోకిరి సినిమా రీ రిలీజ్‌తో అర్థమయింది. అయితే, ఈ మధ్య మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల కోరిక మేరకు మళ్లీ విడుదల చేశారు. మళ్ళీ 17 ఏళ్ల తర్వాత రిలీజ్ చేయగా అదే తరహా వైబ్రేషన్స్ క్రియేట్ చేయడం విశేషం. 17 ఏళ్ల తర్వాత మళ్లీ రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 1.73 కోట్లు కొల్లగొట్టింది. దీంతో మరోసారి ఈ సినిమా మహేశ్ బాబు సత్తా ఏంటో చూపించింది.

ఇవి కూడా చ‌ద‌వండి :  Charmee Kaur :చార్మితో రిలేషన్‌షిప్.. క్లారిటీ ఇచ్చిన Puri Jaganath 

Tags:    

Similar News