Pawan Kalyan: ప్లీజ్! పవన్ కల్యాణ్‌తో ఒక్క ఫొటో ఇప్పించు.. మెగా డాటర్‌ను బతిమాలుకున్న హీరోయిన్.. ఆమె ఎవరంటే?

మెగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అందరికీ సుపరిచితమే.

Update: 2024-07-31 03:16 GMT

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అందరికీ సుపరిచితమే. ఇతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అయితే ఇంకా స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. అయితే బయట ఫ్యాన్సే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకు అభిమానులు ఎక్కువే అని చెప్పడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. దానికి బెస్ట్ ఎక్జామ్‌ఫుల్ నితిన్ లాంటి హీరోలు పవన్ కళ్యాణ్ జపం చేయడం. తాజాగా ఈ లిస్టులో మరో హీరోయిన్ యాడ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ అంటే తనకున్న.. అభిమానాన్ని చెప్పకనే చెప్పింది ఈ నటి. మరి ఇంతకీ ఆమె ఎవరు? ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

రఘు బాబు దర్శకత్వంలో వచ్చిన ‘అవును’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ పూర్ణ. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఈ భామకు అనుకున్నంత రేంజ్‌లో అయితే గుర్తింపు రాలేదు. కానీ, రీసెంట్‌గా వచ్చిన మహేష్ బాబు నటించిన ‘గుంటూరు’ కారం మూవీలో కుర్చీని మడత పెట్టి అనే సాంగ్ పూర్ణాకి ఓ రేంజ్‌లో క్రేజ్ తెచ్చి పెట్టింది. ఈ క్రమంలో పూర్ణ,‌ పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షోలతో బిజీ బిజీగా ఉంటోందీ హీరోయిన్ పూర్ణ. అయితే ఆమె జడ్జిగా వ్యవహరిస్తోన్న ఓ టీవీ షోకు ఇటీవల నిహారిక కూడా గెస్ట్‌గా హాజరైంది. ఈ షోలో పవన్ కళ్యాణ్ జీవిత చరిత్ర పై పిల్లలు సూపర్బ్ స్కిట్ వేశారు. ఈ నేపథ్యంలో పిల్లల స్కిట్ పూర్తయ్యాక నటి పూర్ణ పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా ఇష్టం. ప్లీజ్ నిహారిక.. ఒక్కసారి ఎప్పుడైనా నాకు ఆయనతో ఒక్క ఫొటో ఇప్పించు” అని పూర్ణ రిక్వెస్ట్ చేసింది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

.

Tags:    

Similar News