NANI : నాని కొడుకుని చూశారా.. ఎలా మారిపోయాడంటే?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నాని అష్టాచమ్మా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరస సినిమాలతో దూసుకెళ్లాడు.

Update: 2024-07-25 10:20 GMT

దిశ, సినిమా : టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నాని అష్టాచమ్మా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరస సినిమాలతో దూసుకెళ్లాడు. భలే భలే మగాడివోయ్, నేను లోకల్, ఎమ్‌సీఏ, జెర్సీ, శ్యామ్ సింగారాయ్ మూవీస్‌తో స్టార్ స్టేటస్ అందుకున్నారు. అంతేకాదు రీసెంట్‌గా దసరా సినిమాతో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్నాడు.

ఫ్యామిలీ మూవీలతో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇక నానికి ఒక కొడుకు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నానీ తన కొడుకుతో ఉన్న ఫోటోలు ఎప్పుడూ అంతగా వైరల్ కాలేదు. కాగా, తాజాగా హీరో తన కొడుకుతో చిల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలతో బిజీగా ఉంటూనే తన కొడుకుతో చిల్ అవుతు ఎంజాయ్ చేస్తాడు న్యాచురల్ స్టార్ నాని. దీంతో హీరో కుమారుడిని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నాని కొడుకు అప్పుడే అంత పెద్దవాడు అయిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ ఫోటోలు చూస్తుంటే, కొడుకు ఎదుగుతుంటే ఆ తండ్రి సంతోషం మాటల్లో చెప్పలేం. తాజాగా నాని కూడా తన ఎదుగుతున్న కొడుకుని చూసి ఆనందంతో మురిసిపోతున్నాడు.


Similar News