వివాదంలో ఆదిపురుష్.. ఢిల్లీ కోర్టులో పిటిషన్
ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా టీజర్‌ను దసరా సందర్భంగా సినిమా యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టీజర్ విషయంలో
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఈ సినిమా టీజర్‌ను దసరా సందర్భంగా సినిమా యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా టీజర్ విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఆదిపురుష్ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సినిమాలో రాముడు, రావణుడి పాత్రలను చూపించిన విధానం కరెక్ట్ కాదని పిటిషనర్ పేర్కొన్నారు. అలాగే ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు తోలుతో చేసిన దుస్తులు ధరించారన్న పిటిషనర్, రావణుడిని సైతం సరి అయిన విధంగా చిత్రీకరించలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మతాన్ని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ పలు హిందూ సంస్థలు ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశాయి.
గతవారం ఆదిపురుష్ టీజర్ విడుదలవగా ఈ సినిమాలో రావణుడి పాత్రపై పలు విమర్శలు వచ్చాయి. రూపం వింతగా ఉండడమే కాక కళ్లకు సుర్మా కూడా పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉండడంతో ఇది రామాయణం ఇస్లామీకరణను ప్రతిబింబిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. హనుమంతుడు మీసాలు లేకుండా గడ్డంతో ఉండడం, దానికి తోడు ఆయన వస్త్రాన్ని తోలుతో ఉన్నట్టు చూపడంతో కొందరు ఇది కరెక్ట్ కాదని సినిమాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ సినిమా టీజర్‌పై పలు రాజకీయ పార్టీలు, నాయకుల వర్గాలు విమర్శలు గుప్పించడంతో వివాదాల్లో చిక్కుకుంది. హిందువుల మతపరమైన పాత్రలను తప్పుగా చిత్రీకరించే సన్నివేశాలను తొలగించకుంటే లీగల్ నోటీసులు పంపుతామని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తం మిశ్రా ఇప్పటికే ఆదిపురుష్ చిత్ర నిర్మాతలను హెచ్చరించారు. కాగా, ఇంతకు ముందు ఆదిపురుష్ టీజర్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ న్యాయవాది జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రమోద్ పాండే అనే న్యాయవాది హిందూ దేవుళ్లను కించపరిచేలా టీజర్లో చూపించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలోని నటీనటులు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ విషయంపై లక్నో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు.