Payal : రెండో భార్యగా పాయల్.. ఫస్ట్ వైఫ్‌తో విడాకుల ఇష్యూ తేల్చుకుంటానని ప్రకటన.. నెటిజన్ల రియాక్షన్ ఇదే..
హిందీ 'బిగ్ బాస్ OTT 3' రసవత్తరంగా సాగుతుంది. అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్న షో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈసారి కంటెస్టెంట్స్ కాంట్రవర్షియల్ గా దొరకడంతో
దిశ, సినిమా: హిందీ 'బిగ్ బాస్ OTT 3' రసవత్తరంగా సాగుతుంది. అనిల్ కపూర్ హోస్ట్ చేస్తున్న షో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా ఈసారి కంటెస్టెంట్స్ కాంట్రవర్షియల్ గా దొరకడంతో హౌజ్ లో రోజుకో కథ నడుస్తోంది. అయితే బిగ్ బాస్ ఇంట్లోనే కాదు బయట కూడా ఈ గేమ్ ప్లే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా యూట్యూబర్ అర్మాన్ మాలిక్, తన ఇద్దరు భార్యలతో ఇంట్లోకి వెళ్లగా.. సెకండ్ వైఫ్ పాయల్ నెగటివిటీ కారణంగా బయటకు వచ్చేసింది.
అయితే ఇక్కడ కూడా ఆమెకు విమర్శలు ఎదురుకావడంతో ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించింది. ఒకే ఇంట్లో ఒకే భర్తతో ఇద్దరు భార్యలు ఉండటంపై తిట్టిపోసారు నెటిజన్లు. రోజుకో రకంగా ట్రోల్ చేశారు. దీంతో తాజా ఇంటర్వ్యూలో తాను విడాకులు తీసుకుంటానని ప్రకటించింది. పిల్లలతో కలిసి వెళ్ళిపోతాను అని, వారితోనే బతుకుతానని వివరించింది. అయితే భర్త, కో సిస్టర్ బయటకు వచ్చాక ఫైనల్ డెసిషన్ ఉంటుందని తెలిపింది. ఇక దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజన్లు.. ఇదంతా సింపతీ గేయినింగ్ కోసమే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి డ్రామాలు ఎన్నో చూశామని కామెంట్స్ చేస్తున్నారు.