ఆ సినిమా విషయంలో హర్ట్ అయిన పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు

Update: 2024-05-31 04:22 GMT

దిశ, సినిమా : పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అతను చేస్తున్న అప్ కమింగ్ సినిమాలలో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఏదొక అడ్డంకి వస్తుంది. చిత్ర నిర్మాత ఏ ఏం రత్నం కోసం అయినా ఈ మూవీని పూర్తి చేయాలని అనుకుంటున్నారు కానీ, అది మాత్రం అసలు జరగటం లేదు. ఈ మూవీకి దర్శకత్వం వహించాల్సిన క్రిష్ సడెన్ గా తప్పుకున్నారు.

ఎన్నికల ప్రచార హడావుడిలో ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ, పవన్ అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడం పై చిత్ర నిర్మాత ఏ.ఏం.రత్నం స్పందించారు. ఆయన స్థానంలో జ్యోతికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని, అందర్ని ఒప్పించే క్రిష్ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారని తెలిపారు.

దర్శకత్వ అనుభవం లేని జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు మూవీని ఎలా డైరెక్ట్ చేస్తాడో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ బాధలో అభిమానులకు సంతోషం కలిగించే విషయం ఏమిటంటే, ఈ చిత్రాన్ని ఈ ఏడాదే థియేటర్లలో విడుదల చేస్తామని ఏ.ఏం.రత్నం చెప్పారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బిజీ అయినా విషయం మనకి తెలిసిందే. అతనికి ఉన్న సమయాన్ని ఓజీ సినిమా షూటింగ్ కి కేటాయిస్తున్నారు. మరి, పవన్ స్టార్ ఈ సినిమా కోసం సమయం ఇవ్వగలరో? లేదో ? చుడాల్సి ఉంది.


Similar News