Average Student Nani: యావరేజ్ స్టూడెంట్ నాని.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కుమార్ కొత్తూరి

మెరిసే మెరిసే సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న పవన్ కుమార్ కొత్తూరి.

Update: 2024-07-31 13:21 GMT

దిశ, సినిమా: ‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న పవన్ కుమార్ కొత్తూరి.. ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ నిర్మించారు. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, పాటలకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా.. మూవీపై పాజిటివ్ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కాబోతుండగా.. విడుదల సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్. ఈ మేరకు.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా.. డైరెక్టర్, హీరో పవన్ కుమార్ కొత్తూరి మాట్లాడుతూ.. ‘రెండేళ్లుగా ఈ కథతో ప్రయాణం చేశాను. తల్లి అంటే ఝాన్సీ, తండ్రి అంటే రాజీవ్ కనకాలే అనుకున్నా. లక్కీగా నాకు వాళ్లే దొరికారు. కాలేజ్‌ అంటే రకరకాల క్యారెక్టర్లు కనిపిస్తాయి. నాని పాత్రలో జెన్యూనిటీ ఉంటుంది. కాలేజ్ కుర్రాడంటే జాలీగా ఉంటాడని అంతా అనుకుంటారు. కానీ అదే చాలెంజింగ్ ఫేజ్. పిల్లలు, తల్లిదండ్రుల పడే బాధ, ఆవేదన ఇలా అన్నీ చూపించాను. ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌ను చూపించాను. చాలా కష్టపడ్డాము.. ఫైనల్‌గా ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు ఆగస్ట్ 2న రాబోతున్నాం. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News