ఇక సినిమాలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. పెండింగ్ షూటింగ్స్ పూర్తి చేయాలని నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముసిగింది. ఒకేసారి 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది.

Update: 2024-05-14 07:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ ముసిగింది. ఒకేసారి 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు సోమవారం పోలింగ్ జరిగింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఏపీలో 76 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భారీగా పోలింగ్ నమోదయినట్లు సమాచారం. ఇక ఈ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన 23 అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండు పార్లమెంట్, 21 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి గెలుపు కోసం పవన్ కల్యాణ్ 2 నెలల పాటు నిర్విరామంగా పనిచేశారు. ఎక్కడ గంట విరామం కూడా తీసుకోకుండా.. మండుటెండను కూడా లెక్కచేయకుండా సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు. ఇక ఎన్నికలు ముగియడంతో తన చేతిలో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్‌పై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టినట్లు సమాచారం. వీలైనంత త్వరగా హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్, సింగ్, ఓజీ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హరిహర వీరమల్లు 70 శాతం, ఓజీ 50 శాతం, ఉస్తాద్ భగత్ సింగ్ 20 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. వీటిని పూర్తి చేసి ఏపీలో కూటమి గెలిస్తే సంక్షేమంపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News