అదే ఆఖరు సినిమా.. ఇక చెయ్యకూడదని నిర్ణయించుకున్న: వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ కామెంట్స్ వైరల్

పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు.

Update: 2023-08-11 07:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన చేసిన ‘బ్రో’ సినిమా రిలీజ్ కాగా..‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు షూటింగ్‌లు జరుగుతున్నాయి. మరోవైపు ‘హరిహర వీరమల్లు’ సినిమా చేయాల్సి ఉంది కానీ.. పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా అది ఎన్నికల తర్వాత రావచ్చని సమాచారం.

ఇక రాజకీయ విషయాలకు వస్తే.. పవన్ కల్యాణ్ ప్రస్తుతం వారాహి విజయ యాత్రలో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ యాత్ర విశాఖపట్నం చేరుకుంది. ఈ క్రమంలోనే వైజాగ్‌లోని జగదాంబ సెంటర్లో ఆయన వారాహిపై నిలబడి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘25 ఏళ్ల క్రితం ‘సుస్వాగతం’ సినిమాకి ఇదే జగదాంబ సెంటర్‌లో బస్సుపై డాన్స్ చేయాల్సి వచ్చింది. 25 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వారాహిపై నిలబడి మీతో మాట్లాడుతున్నా. ఆ సినిమా చేసే టైంలో.. అసలు నేను నటుడుని ఎందుకు అయ్యానని నన్ను నేను తిట్టుకునే వాడిని. నాకు పదిమందిలోకి రావాలంటే చాలా సిగ్గు. మా వదినకు ఫోన్ చేసి.. ఎందుకు నేను నటుడుని అయ్యాను. అదే ఆఖరు సినిమా.. ఇక చేయకూడాదని నిర్ణయించుకున్న అని చెప్పినట్లు’’ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read More:  వరలక్ష్మీ శరత్ కుమార్ వెంటపడుతున్న తెలుగు డైరెక్టర్.. దాని కోసమేనా? 

Tags:    

Similar News