Pawan Kalyan: ఉరేసిందానికి, ఆత్మహత్యకు తేడా తెలువని పవన్ కళ్యాణ్.. దారుణంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు (వీడియో)

సోషల్ మీడియా సెన్సేషన్.. హాట్ బ్యూటీ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-08-15 07:32 GMT
Pawan Kalyan: ఉరేసిందానికి, ఆత్మహత్యకు తేడా తెలువని  పవన్ కళ్యాణ్.. దారుణంగా ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు (వీడియో)
  • whatsapp icon

దిశ, సినిమా: సోషల్ మీడియా సెన్సేషన్.. హాట్ బ్యూటీ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తరచూ ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నెట్టింట హాట్‌టాపిక్‌గా నిలుస్తూ ఉంటుంది. అలా ఈ అమ్మడు.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వంటి వారిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అయితే ఈమె మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సపోర్ట్‌గా మాట్లాడుతుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే శ్రీ రెడ్డి నేడు ఇండిపెండెన్స డే సందర్భంగా తాజాగా ట్విట్టర్‌లో ఓ సంచలన పోస్ట్ పెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తగిలించి నెట్టింట షేర్ చేసింది.

ఈ వీడియోలో పవన్ కళ్యాణ్.. మన ఫోర్ ఫాదర్స్ ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ చరిత్ర చదివితే.. 23 ఏళ్ల వయస్సులో భగత్ సింగ్ ఆత్మహత్య చేసేసుకొని చనిపోయాడు. అని గతంలో చెప్పిన పవన్ మాటలకు ఓర్నీ మీ దుంపలు తెగ మీరు ఎక్కడ తయారయ్యార్రా బాబు అనే డైలాగ్‌ను యాడ్ చేస్తూ ‘అనెదర్ డైమండ్ ఫ్రమ్ డిప్యూటీ సీఎం’ అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకోలేదురా సామి ఉరేశారు అని కొంతమంది అంటుంటే.. మరికొందరు మాత్రం ఉరేసిందానికి, ఆత్మహత్యకు తేడా తెలియని వాళ్ళు కూడా డిప్యూటీ సీఎంలు అవుతున్నారంటూ మండి పడుతున్నారు.

(video link credits to srireddy X account)

Tags:    

Similar News