పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. OG మూవీ అప్‌డేట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్యాప్ లేకుండా వరుస సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అంతేగాక, షూటింగ్స్ గ్యాప్‌లో అటు పాలిటిక్స్‌ను సైతం మ్యానేజ్ చేస్తున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గ్యాప్ లేకుండా వరుస సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా గడుపుతున్నారు. అంతేగాక, షూటింగ్స్ గ్యాప్‌లో అటు పాలిటిక్స్‌ను సైతం మ్యానేజ్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరి కల్లా చేతిలో ఉన్న నాలుగు సినిమాల షూటింగ్స్ పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఆయన నటిస్తున్న చిత్రాల్లో OG ఒకటి. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్యాంగ్ స్టర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
తమిళ నటి ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ను సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. మొదటిషెడ్యూల్ ముంబైలో జరుగగా, రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరిగింది. ఇక మూడో షెడ్యూల్ ఈ నెల 4 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కాగా.. నేడు పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని చిత్రబృందంసోషల్ మీడియాలో ఓ ఫోటో ద్వారా తెలియజేసింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పవన్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
మరీ దారుణం.. చికెన్ కోసం ఎన్టీఆర్ ఇలా చేశారేంటి!
Adipurush :10 వేల ‘ఆదిపురుష్’ టికెట్లు బుక్ చేసిన అగ్ర హీరో