Pawan Kalyan :పవన్ కల్యాణ్ కాళ్లు మొక్కిన ప్రొడ్యూసర్.. మరోసారి ట్రోల్స్ ఎదుర్కొంటున్న పీకే
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పేదల కష్టాలను తీర్చి వారి జీవితంలో రంగులు నింపాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. పేదల కష్టాలను తీర్చి వారి జీవితంలో రంగులు నింపాలనే ఉద్దేశ్యంతో రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయ పనులు కూడా చూసుకుంటున్నారు. మరికొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అందులో పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు పవన్. ఎన్నికల ప్రచారం కోసం వారాహి పేరుతో ప్రచార రథాన్ని సిద్ధం చేసుకున్న పవన్.. తాజాగా యాత్రను సైతం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో హోమాలు, యాగాలు చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్‌కు చెందిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పాల్గొన్నారు. వీరందరూ యాగంలో పాల్గొని పవన్ కల్యాణ్ విజయం సాధించాలని ఆకాంక్షించారు. అయితే పవర్‌కు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన వై రవి శంకర్ పవన్ పాదాలకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంత మంది పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసినట్లుగా ట్రోల్స్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఆయన మీద ఉన్న అభిమానాన్ని అలా చూపించారు అంటూ మద్దతు పలుకుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తా: పవన్ కల్యాణ్ (వీడియో)
ఆ హీరోయిన్ అందాలకు సూర్య ఫ్లాట్.. ఫీలింగ్స్ ఆపుకోలేక అలా చేస్తున్నాడా?