నరేష్‌లోతనను బాగా ఆకట్టుకున్నది అదేనంటూ.. అసలు విషయం చెప్పిన పవిత్ర లోకేష్
నరేష్-పవిత్ర లోకేష్ జంట గురించి కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది.
దిశ, సినిమా: నరేష్-పవిత్ర లోకేష్ జంట గురించి కొన్నాళ్లుగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. కాగా వీరిద్దరూ కలిసి ‘మళ్ళీ పెళ్లి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రమోషన్‌లో భాగంగా పవిత్ర లోకేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ‘విజయనిర్మలను కలిశాను కానీ ఎక్కువ అనుబంధం లేదు. అప్పటికే ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇక నరేష్ అయితే ఈ రోజు గురించి ఆలోచిస్తారు. రేపు అనేది ఉంటే రానివ్వు అప్పుడు చూసుకుందాం అంటాడు. ఈ క్షణం తనతో ఉన్నదాంట్లో సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అన్నింటికీ మించి అతను నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. నరేష్‌లో నాకు నచ్చిన లక్షణాలు ఇవే. అందుకే నేను చాలా ఆనందంగా ఉన్నా. అంతకంటే కావాల్సింది ఏముంది’ అని చెప్పుకొచ్చింది పవిత్ర లోకేష్.
Read More: షాకింగ్: ఫైమాను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రవీణ్!
ఆమె నా లైఫ్‌ను కలర్‌ఫుల్‌గా మార్చేసింది.. పరిణీతిపై రాఘవ్ ప్రశంసలు