తన ప్రెగ్నెన్సీ పై మొట్టమొదటి సారిగా స్పందించిన పరిణీతి చోప్రా..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో పరిణీతి చోప్రా ఒకరు. అనతి కాలంలోనే దాదాపు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ చిన్నది

Update: 2024-03-30 03:45 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌లలో పరిణీతి చోప్రా ఒకరు. అనతి కాలంలోనే దాదాపు స్టార్ హీరోలతో జతకట్టిన ఈ చిన్నది మంచి క్రేజ్ సంపాదించుకుంది . ఇక పోతే గత ఏడాది ఆప్ ఎంపీ అయినటువంటి రాఘవ్ చాద్దను వివాహం చేసుకున్న పరిణితి ప్రస్తుతం సంసార జీవితం ఎంతో సంతోషంగా కొనసాగిస్తోంది. అయితే తాజాగా పరిణీతి చోప్రా గర్భం దాల్చింది అంటూ కొన్ని వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటివల ఎయిర్ పోర్టు‌లో కనిపించిన పరినితి వదులు దుస్తులను ధరించి కొంత బోద్దుగా కనిపించింది దీంతో ఆమె కడుపుతో ఉంది అందుకే వదులు దుస్తులు ధరించింది అని పలు వార్తలు వైరల్ చేశారు.

అయితే తాజాగా ఈ విషయంపై స్పందించిన ఈ అమ్మడు ఆగ్రహం వ్యక్తం చేసింది.. ‘నిజ నిజాలు తెలుసుకోకుండా నేను కడుపుతో ఉన్నాను అని వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. లూస్‌గా ఉన్న వస్త్రాలను వేసుకున్నంత మాత్రాన నేను కడుపుతో ఉన్నాన్నని కాదు. అలాంటి హ్యాపీ మూమెంట్ ఏమైనా ఉంటే మీతో కచ్చితంగా పంచుకుంటాను కానీ తెలియకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేయొద్దు ప్లీజ్’ అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది పరిణితి చోప్రా.

Read More..

చీరకట్టులో ఆ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతున్న అనిఖా సురేంద్రన్ .. పిక్స్ వైరల్




 


 

Tags:    

Similar News