చిరు-బాలయ్య కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా!

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న 'అన్‌స్టాపబుల్ 2' షోకు టాలీవుడ్ దిగ్గజ దర్శకులు కె.రాఘవేంద్ర రావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు గెస్ట్‌లుగా హాజరయ్యారు.

Update: 2022-12-01 13:27 GMT

దిశ, సినిమా: నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున్న 'అన్‌స్టాపబుల్ 2' షోకు టాలీవుడ్ దిగ్గజ దర్శకులు కె.రాఘవేంద్ర రావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు గెస్ట్‌లుగా హాజరయ్యారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. వీరిని అతిథులుగా ఆహ్వానించి సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో తెలుగు సినిమా ఖ్యాతి గురించి వివరించిన వారు.. 100ఏళ్ల ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. కాగా ఈ సంభాషణలో తనతో ఎందుకింకా సినిమా చేయలేదని.. బాలయ్య అల్లు అరవింద్‌ను ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా మెగాస్టార్ చిరంజీవి-బాలకృష్ణ కాంబినేషన్‌లో పాన్ ఇండియా ఫిల్మ్ ట్రై చేద్దామని ఇంత కాలం వెయిట్ చేసినట్లు చెప్పాడు.

CM జగన్ వీడియోపై సెటైర్.. మరోసారి వివాదంలో నటి మంచులక్ష్మి! 

Tags:    

Similar News