కారు కొన్న రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. ముందుగా డ్రైవ్ చేసింది శివన్ననే.. (వీడియో)

రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. హీరో శివాజీ సపోర్ట్ తోనే ఇదంతా జరిగిందని ఆయనే స్వయంగా చెప్పాడు.

Update: 2024-05-29 12:55 GMT

దిశ, సినిమా : రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. హీరో శివాజీ సపోర్ట్ తోనే ఇదంతా జరిగిందని ఆయనే స్వయంగా చెప్పాడు. తనను సొంత అన్న మాదిరిగా ట్రీట్ చేస్తానని.. బయట కూడా ఇలాగే కంటిన్యూ కావాలని కోరాడు. మొత్తానికి బిబి హౌజ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా అదే బంధం కొనసాగుతుంది. తాజాగా రైతు బిడ్డ గెలుచుకున్న కారు సెలెక్ట్ చేసేందుకు వెళ్లగా.. శివాజీని ఇన్వైట్ చేశాడు. ముందుగా కారు నడపాలని కోరాడు. నాన్న కోసం కారు కొన్నా అంటూ ఇందుకు సంబంధించిన క్లిప్పింగ్ షేర్ చేశాడు.

కాగా ఈ వీడియోలో శివాజీ కుడి కాలు పెట్టి కారులో కూర్చోగా.. ఆయన మంచి మనసుకు మరోసారి ఫిదా అయ్యారు నెటిజన్లు. ఎదుటి మనిషి బాగుకోరే వ్యక్తులే ఇలా చేస్తారని కొనియాడుతున్నారు. ఇక ముందు సీట్ లో పల్లవి ప్రశాంత్ తండ్రి కోర్చోగా, డ్రైవింగ్ సీట్ లో శివన్న.. వెనుక పల్లవి ప్రశాంత్ కూర్చున్నారు. అయితే ఈ వీడియో చూసిన కొందరు.. రైతులకు డబ్బులు పంచుతానని చెప్పి పూర్తిగా నువ్వే వాడుకుంటున్నవా అని కామెంట్స్ చేస్తుండగా.. ఇంకొందరు అది బిగ్ బాస్ ఇచ్చిన బహుమతి అని గుర్తుచేస్తున్నారు.

Tags:    

Similar News