ఓటీటీ సినిమా రంగాన్ని డిస్ట్రబ్ చేసింది.. Nimrat Kaur ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఓటీటీ వేదిక చాలామందికి అవకాశాలను కల్పించినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం దారుణంగా విఫలమైనట్లు భావిస్తున్నానంటోంది నిమ్రత్ కౌర్.
దిశ, సినిమా: ఓటీటీ వేదిక చాలామందికి అవకాశాలను కల్పించినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం దారుణంగా విఫలమైనట్లు భావిస్తున్నానంటోంది నిమ్రత్ కౌర్. రీసెంట్‌గా ఓ సమావేశంలో థియేటర్, ఓటీటీల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడిన నటి.. ‘OTT ప్లాట్‌ఫామ్ అవకాశాల సునామీ. ఇందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కొత్తవాళ్లను, ప్రతిభవంతులను ప్రోత్సహించిన తీరు అద్భుతం. ఇందులోని కంటెంట్ ఎఫెక్ట్‌తో సినిమా రంగంలో మరింత సృజనాత్మక పెరిగింది. అయితే కథ ప్రాధాన్యతను పరిగణలోకి తీసుకోకుండా నటీనటులను సెలక్ట్ చేసే తీరు నాకు నచ్చలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ విషయంలో నటులు, సాంకేతిక నిపుణులు, చిత్రనిర్మాతలను చెడగొట్టింది. అంతకు మించి ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు’ అంటూ తన ఫీలింగ్స్ బయటపెట్టింది.
Also Read: ఈ వారం థియేటర్, ఓటీటీలో ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా?
బెడ్ రూమ్ సీన్స్‌లో రెచ్చిపోయిన తమన్నా.. మరో సన్నీలియోన్ అంటూ పోస్ట్