చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా.. ‘నాటునాటు’ పాటకు ఆస్కార్ అవార్డు

ప్రపంచ వ్యాప్తంగా భారత సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఆ సమయం రానే వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు వచ్చింది.

Update: 2023-03-13 03:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా భారత సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ఆ సమయం రానే వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు వచ్చింది. కాగా, ఆస్కార్ అందుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు పాట రికార్డు సృష్టించింది. ఆస్కార్ వేదికపై సినిమా సంగీత దర్శకుడు కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ అవార్డు అందుకున్నారు. అంతకముందు ఆస్కార్ వేదికపై.. నాటు నాటు పాటకు హాలీవుడ్ డ్యాన్సర్స్‌తో సింగర్స్ రాహుల్ సిప్లింగంజ్, కాలభైరవ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. దీంతో చిత్రబృందం మొత్తం ఆనందంలో ముసిరిపోయారు. ఈ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ దర్శకుడు రాజమౌళి, నటులు రామ్ చరణ్ తేజ్-ఉపాసన, ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, సింగర్స్ రాహుల్ సిప్లింగంజ్, కాలభైరవ‌లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

గర్వంగా ఉంది.. MM కీరవాణి ఎమోషనల్ స్పీచ్ (వీడియో)

తెలుగు సినిమా గర్వపడే సమయం (వీడియో)

Tags:    

Similar News