ఓటీటీలోకి ఆపరేషన్ వాలెంటైన్..స్ట్రీమింగ్ ఎందులోనంటే?

2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లో పుల్వమాలో ఉగ్రవాదులు జరిపిన దాడిపై రివెంజ్ తీర్చుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రీక్ కథ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్

Update: 2024-03-09 02:24 GMT

దిశ, సినిమా : 2019 ఫిబ్రవరి 14న కశ్మీర్‌లో పుల్వమాలో ఉగ్రవాదులు జరిపిన దాడిపై రివెంజ్ తీర్చుకోవడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రీక్ కథ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రిలీజై, బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ మూవీ హిట్ అందుకోలేదు.

అయితే థియేటర్లలో రిలీజైన నెలలోపే ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.ఆపరేషన్ వాలెంటైన్ డిజిట‌ల్ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకున్న‌ది. వ‌రుణ్ తేజ్ మూవీ మార్చి 29 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోందంట.



Similar News