ఒకప్పుడు రోడ్డుమీద మినరల్ వాటర్ అమ్మాడు.. ఇప్పుడు జాతీయ అవార్డు అందుకున్న స్టార్ హీరో.. నెట్టింట ప్రశంసల వర్షం

నిన్న 70వ నేషనల్ ఫిలిం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కాంతారా సినిమాలో తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకున్నందుకు గాను హీరో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు అవార్డు వరించింది.

Update: 2024-08-17 06:22 GMT

దిశ, సినిమా: నిన్న 70వ నేషనల్ ఫిలిం అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కాంతారా సినిమాలో తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్‌తో ఆకట్టుకున్నందుకు గాను హీరో రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడు అవార్డు వరించింది. అయితే ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ అవార్డుకు ఆయన అర్హుడే అని.. ఆయన నటనకు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అని ప్రశంసిస్తారు. అయితే అందరి హీరోల్లాగా రిషబ్ శెట్టికి ఈ సక్సెస్ అంత ఈజీగా ఏం దక్కలేదు. ఎందుకంటే ఈ రోజు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న రిషబ్ శెట్టి ఒకప్పుడు మినరల్ వాటర్ అమ్మారు అనే విషయం చాలామందికి తెలియదు. అలాగే అప్పు ఇచ్చినవాళ్లు ఎక్కడ గొడవ చేస్తారో అని మారువేషంలో వాళ్ళకి కనబడకుండా తిరిగిన రోజులు కూడా చాలా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే..

కర్ణాటక రాష్ట్రంలోని కెరాడి అనే పల్లెటూరులో ఓ మధ్యతరగతి కుటుంబంలో రిషబ్ శెట్టి జన్మించారు. డిగ్రీ పూర్తి కాకముందే ఫిలిం ఇన్స్టిట్యూట్‌లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరారు. ఆ సమయంలో ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకూడదని భావించిన రిషబ్ శెట్టి.. మినరల్ వాటర్ బిజినెస్ మొదలుపెట్టారు. అలా ఫస్ట్ సైనైడ్ మూవీకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కానీ, ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ‘గండ హెండతి’ సినిమాకు క్లాప్ బాయ్‌గా చేరారు. ఆ సినిమాకు ఏడాది పని చేస్తే రిషబ్‌కు కేవలం 1500 రూపాయలు వేతనంగా దక్కింది. అలా చాలీ చాలని వేతనంతో కిరిక్ పార్టీ అనే సినిమాతో తొలి సక్సెస్ అందుకున్నారు రిషబ్ శెట్టి. ఆ తర్వాత అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమాల్లో నటిస్తూ వరుస విజయాలతో కెరీర్‌ను కొనసాగిస్తూ ఏకంగా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు స్టార్ హీరో రిషబ్ శెట్టి. ప్రస్తుతం ఇతను ‘కాంతారా 2’ సినిమాతో బిజీగా ఉన్నాడు.


Tags:    

Similar News