అక్షయ తృతీయ నాడు రూ. 15 లక్షల జ్యువెల్లరీని తల్లికి గిఫ్టుగా ఇచ్చిన బిగ్‌బాస్ విన్నర్.. పోస్ట్ వైరల్

కామన్ మ్యాన్‌లా ‘బిగ్‌బాస్ సీజన్-7’లో అడుగుపెట్టి ఎంతో పట్టుదలతో ఆడి సీజన్ విన్నర్‌గా నిలిచి సెలబ్రిటిగా మారిన పల్లవి ప్రశాంత్ మనందరికీ సుపరిచితమే.

Update: 2024-05-11 03:36 GMT

దిశ, సినిమా: కామన్ మ్యాన్‌లా ‘బిగ్‌బాస్ సీజన్-7’లో అడుగుపెట్టి ఎంతో పట్టుదలతో ఆడి సీజన్ విన్నర్‌గా నిలిచి సెలబ్రిటిగా మారిన పల్లవి ప్రశాంత్ మనందరికీ సుపరిచితమే. కానీ బయటకు వచ్చాక పెద్ద ఎత్తున ర్యాలీ చేయడంతో అతని ఫ్యాన్స్ రెచ్చిపోయి బస్సులపై రాళ్లు రువ్వి ప్రజాధనాన్ని నష్టం చేకూర్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రశాంత్‌ను అరెస్టు చేసి 2 రోజులు జైలుకు కూడా పంపించారు.

అయితే బిగ్ బాస్ 7 విన్నర్‌గా, ప్రైజ్ మనీ కింద రూ. 50 లక్షలు రావాల్సి ఉండగా.. ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షల సూట్ కేసును సొంతం చేసుకోవడంతో కేవలం ప్రశాంత్‌కు రూ. 35 లక్షలు దక్కాయి. వీటిలో కొంత డబ్బు ట్యాక్సుల రూపంలో పోగా కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లగ్జరీ కారు కూడా గెలుచుకున్నాడు.

ఇదిలా ఉంటే.. హౌస్‌లో ఉన్నప్పుడు రూ. 15 లక్షల విలువైన జ్యువెలరీ కూడా ఇస్తామని ప్రకటించారు. కానీ ఐదు నెలలు కావస్తున్నా ఆ జ్యువెల్లరీ ఇవ్వలేదు. తాజాగా వాటిని అందించింది బిగ్ బాస్ యూనిట్. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ 'అమ్మకు తొలి కానుక. బిగ్ బాస్ ఏడో సీజన్ కు థాంక్స్. లవ్ యూ నాగ్ సర్' అంటూ ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు మదర్స్ డే గిఫ్ట్ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read More...

అన్ని లక్షలు పెట్టి కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. వీడియో వైరల్ 

Tags:    

Similar News