‘ఓం రౌత్ నిన్ను చంపేస్తా’.. ‘ఆదిపురుష్’ డైరెక్టర్‌పై ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)
ప్రభాస్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా మోస్ట్ ఏవెటింగ్ మూవీగా ‘ఆదిపురుష్’ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రభాస్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా మోస్ట్ ఏవెటింగ్ మూవీగా ‘ఆదిపురుష్’ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. రామాయణ ఇతివృత్తంతో సినిమా అందులోనే ప్రభాస్ హీరోగా నటించడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. స్టైలిష్‌గా రామాయణాన్ని దర్శకుడు ఓంరౌత్ తీసే ప్రయత్నం చేశారు. అయితే సినిమా చూసిన ప్రేక్షకులు ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద దర్శకుడు ఓంరౌత్‌పై ఫైర్ అవుతున్నారు.
ఓ మహిళ సినిమా గురించి మాట్లాడుతూ.. వరస్ట్‌గా ఉంది సినిమా అని తెలిపింది. మరో ఫ్యాన్ నిద్ర వచ్చింది సినిమా చూస్తుంటే అని కామెంట్ చేశాడు. సినిమా చూసిన ఓ యువకుడు ‘ఓం రౌత్ మా రూంకు రా’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. మరో అభిమాని ‘రామాయణం ఎవరైనా ఇలా తీస్తారా’ అంటూ ఫైర్ అయ్యాడు. సినిమా చూసిన మరో యువకుడు ఓంరౌత్‌ను చంపేస్తా అంటూ హెచ్చరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More: సినిమా బాలేదు అని చెప్పినందుకు చితక్కొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్ (వీడియో)