OG Teaser: పవర్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. ‘ఓజీ’ టీజర్‌కు టైమ్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Update: 2023-08-31 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కనిపించనున్నారు. కాగా, పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఓజీ టీజర్/గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయింది. 'హంగ్రీ చీతా' పేరుతో ఇది రానుంది. ఓజీ టీజర్ రిలీజ్ టైమ్‍ను మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

‘ఓజీ’ హంగ్రీ చీతాను సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల 35 నిమిషాలకు తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆకలితో ఉన్న పులి (హంగ్రీ చీతా) సెప్టెంబర్ 2 ఉదయం 10.35 గంటలకు రానుందని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ఓటీ టీజర్ 70 సెకన్ల నిడివితో ఉంటుందని తెలుస్తోంది. నటుడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో ఎలివేషన్ డైలాగ్స్ ఉంటాయని సమాచారం. పవర్‌ఫుల్ గ్యాంగ్‍స్టర్‌లా పవన్ కల్యాణ్ ఈ సినిమాలో కనిపించనున్నారు.


Similar News