నేను లేకపోతే ఎన్టీఆర్ బ్రతికేవాడు కాదు.. టాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ కమెడీయన్ శ్రీనివాస్ రెడ్డి ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు.

Update: 2023-10-31 05:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ కమెడీయన్ శ్రీనివాస్ రెడ్డి ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘ ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాలకు వస్తున్నప్పుడు ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వారందరినీ కూడా ఈ ప్రచారంలో పాల్గొనాలని చెప్పారు. అయితే ఒక్కొక్కరు ఒక్కో రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. ఈ క్రమంలోనే ఖమ్మం దగ్గర ప్రచారం చేస్తుండగా నేను ఆరోజు పార్టీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నాను. ఇక అంతా పూర్తి అయి బయలుదేరే సమయంలో ఎన్టీఆర్ ఒక వెహికల్ లో వెళ్తున్నారు. నన్ను కూడా అక్కడికి రమ్మని చెప్పారు. అయితే నేను నా బ్యాగ్ కోసం వెళ్లగా అప్పటికే మరొకరు రావడంతో ఆ కారులో తనని ఎక్కించుకొని ఎన్టీఆర్ వెళ్లిపోయారు. ఇక ఎన్టీఆర్ వెహికల్ వెనుకనే మా కారు కూడా వెళ్తుంది.

అయితే కొంత దూరం పోగానే ఆ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది ఎన్టీఆర్ మొత్తం రక్తంతో తడిసిపోయి ఉండడం చూసి వెంటనే నా బ్యాగ్ లో ఉన్నటువంటి టవల్ తీసి ఆయనకు కట్టి దగ్గర్లో నాకు తెలిసిన హాస్పిటల్ కి తనని తీసుకెళ్ళాను. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత సీటికి తరలించాం. ఆరోజు యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను అక్కడ ఉన్నాను కాబట్టే ఎన్టీఆర్ ప్రాణాలతో వచ్చారు. కానీ కొంతమంది మాత్రం నేనంటే గిట్టని వారు తన గురించి ఒక బాడ్ రూమర్ వైరల్ చేశారు నేను ప్రచార కార్యక్రమంలోకి అడుగుపెట్టగానే ఎన్టీఆర్ కి అలాంటి ప్రమాదం జరిగింది అంటూ మాట్లాడారు. ఆ విషయం నన్ను చాలా బాధ కలిగించింది నిజానికి నేను అక్కడ ఉండబట్టే ఎన్టీఆర్ బ్రతికారు’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News