అసలు నిన్నెవరు చూస్తారు అని ఎన్టీఆర్ ముఖం మీదే అనేశాడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-10-04 02:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘లక్ష్మి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి స్టార్‌డమ్ తెచ్చుకుంది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఈమె తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం వంటి భాషల్లో కూడా నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. వరుస చిత్రాలు, లేడీ ఓరియెంటెడ్ మూవీలు చేస్తూ స్టార్ హీరోయిన్ అయింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. సరోగసి ద్వారా ఇద్దరు బాబులకు తల్లి కూడా అయింది. ప్రస్తుతం ఓ పక్కా సినిమాలు మరోపక్క ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. అంతేకాక సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అన్ని విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో నయనతార ఎన్నో సినిమాల్లో నటించిన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన మూవీ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్, నయనతార, షీలా, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మొన్న రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇన్నేళ్లకు విడుదల అయినా కూడా అంతే ఎనర్జీతో ప్రేక్షకులు ఈ మూవీని తెగ ఎంజాయ్ చేశారు. అయితే.. అదుర్స్ షూటింగ్ సమయంలో తారక్ తనపై కామెంట్ చేసాడంటూ నయనతార ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.

ఆమె మాట్లాడుతూ.. "షూటింగ్ సమయంలో నేను మాటిమాటికీ టచప్ చేయించుకుంటున్నాను. అలా టచప్ చేసుకుంటూ లిప్‌స్టిక్ రాసుకుంటూ ఉంటే.. తారక్ పక్కనే నిలబడి అలాగే చూస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు అని తారక్‌ని అడిగితే.. ఎందుకు అంతగా మేకప్ వేసుకుంటున్నావ్ అని అడిగాడు. అప్పుడు నేను.. షాట్‌లో అందంగా కనిపించాలి కదా అని సమాధానం ఇచ్చాను. దీంతో తారక్ నువ్వెంత మేకప్ చేసుకున్నా జనాలు నిన్ను చూడరు. నన్నే చూస్తారు అని అన్నాడు. అది విని నాతో పాటు సెట్‌లో ఉన్నవారు సరదాగా నవ్వుకున్నారు. మరి మన చారీ లుక్, గెటప్ అలాంటిది కదా" అంటూ నయన్ నవ్వేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Similar News