NTR క్రేజ్.. విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘దేవర’?
హీరో ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం తెరకెక్కుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: హీరో ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. అనిరుద్ సంగీతం సమకూర్చుతున్నారు. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలయ్యింది. తాజాగా ఓటీటీ రైట్స్ లాక్ చేసినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్‌లలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ రైట్స్ దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే ఈ సంస్థ ఓటీటీ రైట్స్ కోసం రూ.120 కోట్ల భారీ ధర చెల్లించటానికి ఒప్పందం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.