Nora Fatehi: పాటలో ఉత్తమ ప్రదర్శన అవార్డ్స్ ఎందుకివ్వరు? ఇది అన్యాయమే..
ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న అవార్డ్స్ వేడుకల్లో పాటకు ప్రత్యేక గుర్తింపు, బహుమానం లేకపోవడంపై నోరా ఫతేహి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల వరుస అవార్డ్స్ ఫంక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మాట్లాడిన నటి.. ‘పాటలో
దిశ, సినిమా: ప్రముఖ సంస్థలు నిర్వహిస్తున్న అవార్డ్స్ వేడుకల్లో పాటకు ప్రత్యేక గుర్తింపు, బహుమానం లేకపోవడంపై నోరా ఫతేహి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇటీవల వరుస అవార్డ్స్ ఫంక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మాట్లాడిన నటి.. ‘పాటలో ఉత్తమ ప్రదర్శన (బెస్ట్ ఫర్ఫార్మర్ ఇన్ ఏ సాంగ్)’ కేటగిరీలో అవార్డు లేకపోవడాన్ని ఖండించింది. ‘మాలాంటి కొందరు నృత్యరీతులతోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారు. కానీ ఎప్పుడూ, ఎక్కడ అవార్డు పొందలేదు. నిజానికి డ్యాన్స్ ద్వారా కూడా కథలు చెప్పేందుకు స్కోప్ ఉంది. డ్యాన్స్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ లవ్ స్టోరీని నేను చాలా ఇష్టపడతా. ఇకనైనా ఈ పరిస్థితి మారుతుందని ఆశిస్తున్నా’ అని తెలిపింది.
Also Read..
ఆ సమయంలో భర్తకు నో చెప్పలేకపోయిన అనసూయ.. ఇప్పుడు ఇబ్బంది పడుతుందట!