ఆరు భాషల్లో అవలీలగా మాట్లాడగలిగే ఏకైక టాలీవుడ్ హీరోయిన్..!
మలయాళ కుట్టి నిత్యా మీనన్ గురించి సుపరిచితమే.
దిశ, సినిమా: మలయాళ కుట్టి నిత్యా మీనన్ గురించి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయకుండా నిలదొక్కుకున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన నిత్యా మీనన్.. ‘గుండె గల్లంతయిందే, అలా మొదలైంది, జనతా గ్యారేజ్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఇష్క్, ఉస్తాద్ హోటల్, s/o సత్యమూర్తి, బీమ్లా నాయక్’ వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.
ఇండస్ట్రీలో నిత్యా మీనన్ వేరీ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. అయితే నిత్యా మీనన్ 6 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో అవలీలగా మాట్లాడగలుగుతుందట. ఈ భాషల్లో నటించే సినిమాలకు ఏకంగా తనే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.
ఈ వార్త విన్న నెటిజన్లు సోషల్ మీడియాలో నిత్యా మీనన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో నటించి.. ప్రేక్షకులను కట్టిపడేసిన విషయం తెలిసిందే. వీరిద్దరి కెమిస్ట్రీకి ఫ్యాన్స్, ఆడియన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ప్రస్తుతం నిత్యామీనన్ కు అవకాశాలు ఎక్కువగా రావడం లేదు.