Official : విడాకులపై నిహారిక సంచలన పోస్ట్.. బాధపెట్టొద్దంటూ విజ్ఞప్తి!
మెగాడాటర్, నాగబాబు గారాల పట్టీ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ చాలా వార్తలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా, దీనిపై మెగా ఫ్యామిలీ కానీ, చైతన్య, నిహారికల నుంచి ఎలాంటి స్పందన లేదు.
దిశ, వెబ్‌డెస్క్ : మెగాడాటర్, నాగబాబు గారాల పట్టీ నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ చాలా వార్తలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా, దీనిపై మెగా ఫ్యామిలీ కానీ, చైతన్య, నిహారికల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఇవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు మెగా అభిమానులు.కాగా ఈ న్యూస్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. కొద్దిగంటల క్రితమే నిహారిక చైతన్యలకు విడాకులను కన్ఫామ్ చేస్తూ హైదరాబాద్‌లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులను మంజూరు చేసింది .
కాగా, తాజాగా నిహారిక విడాకులపై స్పందించిది. భర్త చైతన్య, తాను పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు ఇన్‌స్టా గ్రామ్ వేధికగా ఆమె ప్రకటించింది. ఈ సున్నిత సమయంలో తమని బాధ పెట్టవద్దని, తామిద్దరం కొత్తగా ప్రారంభించే వ్యక్తిగత జీవితం విషయంలో ప్రైవసీ కోరుకుంటున్నామని, దీన్ని అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఇతకాలం తనకు అండగా నిలిచిన కుటుంబం, సన్నిహితులకు నిహారిక కృతజ్ఞతలు తెలియజేశారు.
Read More..
Niharika Divorce: చైతన్యతో విడిపోతానని నిహారికకు ముందే తెలుసా.. అందుకే ఆ పనికి ఇష్టపడలేదా?
విడాకులు తీసుకున్న మెడలో నల్లపూసలు ధరిస్తున్న సమంత.. కారణం అదేనా?
భరణం కింద నిహారిక ఎన్ని కోట్లు డిమాండ్ చేసిందో తెలుసా?