ఇండస్ట్రీని షేక్ చేస్తున్న న్యూస్..!! ఆ కమిట్ మెంట్ ఇచ్చాకే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందా..?
ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో కుర్రకారులో నేషనల్ క్రష్ అనే బిరుదును సొంతం చేసుకుంది.
దిశ, సినిమా: ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో కుర్రకారులో నేషనల్ క్రష్ అనే బిరుదును సొంతం చేసుకుంది. తర్వాత సరిలేరు నీకెవ్వరు, గీతా గోవిందం, పుష్ప సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటీవల యానిమల్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న నేషనల్ క్రష్.. ఇప్పుడు పుష్ప 2, రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్, కుబేర వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఈ నాలుగు చిత్రాలు కొన్ని నెలలుగా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో భాగంగా తనకు తానే కమిట్మెంట్ తీసుకొని ప్రామిస్ చేసుకొని హీరోయిన్ గా మారింది అన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రష్మిక మందన్నా కూడా అందరూ అమ్మాయిల లాగే 24-25 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసుకోవాలి పిల్లలను కని లైఫ్ లో సెటిల్ అవ్వాలి .. భర్త పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకునేదట.
కానీ తన కుటుంబం ఫైనాన్షియల్ పరంగా వెనుకబడి ఉండటంతో రష్మిక ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి. ఆ తర్వాతే పెళ్లి - పిల్లలు అంటూ తనకు తానే ఒక ప్రామిస్ చేసుకుని రష్మిక పెద్ద హీరోయిన్ గా మారింది . ఇప్పటికీ ఆమె డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందట. అంతేకాదు విజయ్ దేవరకొండ తో ప్రేమాయణాన్ని బయటకు పట్టకపోవడానికి కూడా ఇది ఒక రీజన్ అంటున్నారు ఆమె అభిమానులు..!