కిరణ్ అబ్బవరం ‘క’ వచ్చేది అప్పుడే..

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘క’.

Update: 2024-09-27 13:09 GMT

దిశ, సినిమా: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘క’. పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ ద్వారా సుజిత్, సందీప్ టాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్లుగా పరిచయమవుతున్నారు. శ్రీ చక్రాస్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏకంగా రూ. 20 కోట్ల భారీ బడ్జెట్‌తో రాబోతుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. అయితే.. ఈ సినిమా త్వరలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుందని తెలిపిస మేకర్స్.. వచ్చేది ఎప్పుడనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. లేటెస్ట్ సమాచారం మేరకు.. ‘క’ చిత్రాన్ని అక్టోబర్ చివరి వారంలో రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నారని ఫిలిమ్ సర్కిల్‌లో వార్తల్లో వినిపిస్తున్నాయి. అంతేకాకుండా త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనున్నారట మేకర్స్.


Similar News