మనుషుల్లాగే మంచి-చెడు కలలు కంటున్న ఆక్టోపస్
ఆక్టోపస్‌లు మనుషుల్లాగే చాలా తెలివైనవనే విషయం తెలిసిందే. కానీ ఇవి కూడా కలలు కంటాయని నిర్ధారించారు శాస్త్రవేత్తలు. నిద్రలో ఉన్నప్పుడు రంగులు మార్చడాన్ని బట్టి ఈ విషయాన్ని గుర్తించిన సైంటిస్టులు
దిశ, సినిమా :ఆక్టోపస్‌లు మనుషుల్లాగే చాలా తెలివైనవనే విషయం తెలిసిందే. కానీ ఇవి కూడా కలలు కంటాయని నిర్ధారించారు శాస్త్రవేత్తలు. నిద్రలో ఉన్నప్పుడు రంగులు మార్చడాన్ని బట్టి ఈ విషయాన్ని గుర్తించిన సైంటిస్టులు.. మంచి కలలు మాత్రమే కాకుండా చెడు కలలను కూడా కలిగి ఉంటాయని భావిస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని ది రాక్‌ఫెల్లర్ విశ్వవిద్యాలయంలో ఉండే కాస్టెల్లో అనే మగ ఆక్టోపస్‌పై ఈ పరిశోధనలు జరగ్గా.. దాదాపు మూడు నెలలపాటు ప్రతీ రోజు 24గంటలు కెమెరాలు దాని కదలికలను చిత్రీకరించాయి. ఈ ఫుటేజీని పరిశీలించిన శాస్త్రవేత్తలు.. కలలు కంటున్నప్పుడు దాని బాడీ లాంగ్వేజ్ ద్వారా లోపలి విషయాలను భౌతికంగా ప్రతిబింబిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.
ఈ ఆక్టోపస్ చెదిరిన నిద్ర నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రదర్శించే ప్రవర్తనా క్రమాలు మానవులలో పీడకలలు, రాత్రి భయాలు, ఇతర పారాసోమ్నియాలకు ప్రవర్తనా ప్రతిస్పందనలను పోలి ఉంటాయని తెలిపారు. ఈ ఎపిసోడ్‌లలో ప్రదర్శించబడిన ప్రవర్తనలు ఆక్టోపస్‌లు పారాసోమ్నియాలను అనుభవించవచ్చని సూచిస్తున్నాయని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఇందులో నిద్రకు భంగం కలిగించే పీడకలలు కూడా ఉండవచ్చని వివరించారు.